సాగర కన్యలా రాశీ ఖన్నా: అందాల ఆరబోత.. రూటుమార్చిన బ్యూటీ!

Spread the love

రాశీ ఖన్నా హాట్‌నెస్ పెంచేస్తున్నారు. ఓవర్ ఎక్స్‌పోజింగ్‌తో ఆశ్చరపరుస్తున్నారు. దీనికి కారణం ఏంటి? ఆమెకు సినిమాలు రావడం లేదా? ఇంకేదైనా కారణం ఉందా?

చిలిపి కన్నుల చిన్నది రాశీ ఖన్నా రూటు మార్చారు. అందాలు ఆరబోస్తున్నారు. ఇప్పటి వరకు ఓ మాదిరి ఎక్స్‌పోజింగ్ చేస్తూ తన అందంతో కుర్రకారును కట్టిపడేసిన రాశీ.. ఇప్పుడు హాట్‌నెస్ డోస్ పెంచుతున్నారు. ఇప్పటి వరకు చేయని రేంజ్‌లో హాట్ ఫొటో‌షూట్‌లు చేస్తున్నారు. దీనికి కారణం ఏంటి? సినిమా అవకాశాలు పెంచుకోవడానికే ఈ హాట్ ఫొటోషూట్లా? అంటే ఔననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాలో తన హాట్‌నెస్‌ను కాస్త పరిచయం చేశారు రాశీ. ఇకపై మరింత రెచ్చిపోనున్నట్టు ప్రచారం జరుగుతోంది.

వారం రోజుల క్రితం స్వెటర్ లాంటి డ్రెస్‌లో హాట్ ఫొటోషూట్ ఒకటి చేశారు రాశీ. కేవలం స్వెటర్ మాత్రమే ధరించి ఇంకేమీ వేసుకోకుండా అందాలను ఆరబోశారు. ఇప్పుడు మరోసారి సెక్సీ ఫొటోషూట్‌తో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈసారి చేప పొలుసు లాంటి డ్రెస్‌లో సెక్సీ లుక్‌లో అదరగొట్టారు. ఫ్లోర్‌పై సాగర కన్యలా అందాలను పరిచేశారు. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో చూసిన రాశీ ఫ్యాన్స్ హాట్‌నెస్ ఓవర్ లోడెడ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కొంత మంది అయితే రాశీ ఎందుకిలా చేస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు.

కాగా, రాశీ ఖన్నా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై ఆరు సంవత్సరాలు దాటింది. నాగశౌర్య హీరోగా శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో 2014లో వచ్చిన ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో రాశీ ఖన్నా హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. తొలి సినిమాతో కుర్రకారును కట్టిపడేశారు. తన అందం, అభినయంతో ఆకట్టుకున్నారు. ఆ తరవాత వరుస అవకాశాలతో జోరు పెంచారు. ఏడాదికి రెండు మూడు సినిమాలు చేస్తూ బిజీ అపోయారు. చలాకీగా, కామెడీని పండిస్తూ మిగిలిన హీరోయిన్లకు తాను విరుద్దం అని నిరూపించుకున్నారు. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా రాశీ సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు తమిళ సినిమాలు ఉన్నాయి. కానీ, ఈ ఏడాది ఇంకా ఆమెకు తెలుగు సినిమా అవకాశం రాలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Open chat