రెండు రంగుల పొట్టి గౌనులో శ్రీముఖి.. సుధీర్‌ని కాపీ కొట్టేసిందంటూ కామెంట్స్!

Spread the love

బుల్లితెర యాంకర్, నటి శ్రీముఖి వెరైటీ డ్రెస్‌లో కనిపించారు. ఓ వైపు బంగారు వర్ణం, మరోవైపు ముదురు ఆకుపచ్చ రంగులో ఉన్న ఈ పొట్టి గౌను ఆకర్షణీయంగా ఉంది.

టీవీ యాంకర్, నటి శ్రీముఖికి యూత్‌లో ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘జులాయి’ సినిమాలో అల్లు అర్జున్‌కి చెల్లెలుగా నటించి వెండితెరకు పరిచయమైన శ్రీముఖి.. ఆ తరవాత ‘ప్రేమ ఇష్క్ కాదల్’ సినిమాతో హీరోయిన్‌గా మారారు. కానీ, హీరోయిన్‌గా నిలదొక్కుకో లేకపోయారు. ఆ తరవాత ‘ధనలక్ష్మి తలుపులు తడితే’, ‘నేను శైలజ’, ‘సావిత్రి’, ‘జెంటిల్‌మేన్’, ‘మనలో ఒక్కడు’ సినిమాల్లో కనిపించారు. ఆమె చివరిగా నటించిన చిత్రం ‘బాబు బాగా బిజీ’. ఈ సినిమా విమర్శలపాలైంది.

ఓ వైపు నటిగా ప్రయత్నిస్తూనే బుల్లితెరపై యాంకర్‌గా ఓ మెరుపు మెరిశారు శ్రీముఖి. వ్యాఖ్యాతగా తనదైన మార్కు చూపించారు. బుల్లితెర రాములమ్మగా పేరుగాంచారు. ‘పటాస్’ షో శ్రీముఖికి కెరీర్‌లో మరో మైలురాయి. ఆ తరవాత బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో పాల్గొనడంతో శ్రీముఖి క్రేజ్ మరింత పెరిగింది. ఆమెకంటూ ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ క్రియేట్ అయ్యింది. బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తరవాత కూడా వ్యాఖ్యాతగా శ్రీముఖి రాణిస్తూనే ఉన్నారు. తాజాగా ‘బొమ్మ అదిరింది’ షోతో మళ్లీ బుల్లితెరపై మెరిశారు.

ఇది కాకుండా సొంతంగా ‘ఓ ఉమనియా’ టాక్ షో చేస్తున్నారు. తన సొంత యూట్యూబ్ ఛానెల్‌లో ఈ టాక్ షోను పబ్లిష్ చేస్తున్నారు. తొలి ఎపిసోడ్ ప్రముఖ యాంకర్ సుమతో మొదలుపెట్టి షోకి మంచి ప్రచారం కల్పించారు. ఈ షో శుక్రవారం నాలుగో ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టింది. యూట్యూబ్ సెన్సేషన్ ‘మహాలక్ష్మి’ జాహ్నవిని ఎపిసోడ్ 4కి ఆహ్వానించారు శ్రీముఖి. ఈ ఎపిసోడ్‌కి మంచి స్పందన వస్తోంది. ఇదిలా ఉంటే, ఈ షోలో శ్రీముఖి వెరైటీ డ్రెస్‌లో కనిపించారు. రెండు రంగులతో కూడి పొట్టి గౌను అది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Open chat