మంచు లక్ష్మి కొత్త షో: రాజమౌళి, సానియా మీర్జా.. భారీగా ప్లాన్ చేసింది!

Spread the love

సినీ నటి, టీవీ హోస్ట్ మంచు లక్ష్మి మరో కొత్త షోతో ప్రేక్షకుల ముందుకు వస్తు్న్నారు. ‘లాక్ట్ అప్ విత్ లక్ష్మీ మంచు’ పేరుతో వస్తోన్న ఈ షోను ఆమె గురువారం ప్రకటించారు.

కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు నట వారసురాలు లక్ష్మీ మంచు సినిమాల్లో నటించడంతో పాటు హోస్ట్‌గా బుల్లితెరపై కూడా తనదైన ముద్ర వేశారు. ‘లక్ష్మీ టాక్ షో’తో మొదలైన లక్ష్మి బుల్లితెర ప్రయాణం.. ‘ప్రేమతో మీ లక్ష్మి’, ‘లక్కుంటే లక్ష్మి’, ‘మేము సైతం’, ‘మహారాణి’ వంటి షోలతో కలర్‌ఫుల్‌గా సాగింది. నిజానికి ల‌క్ష్మీ మంచు త‌న కెరీర్‌‌ను ఇంగ్లిష్‌లో మొదలుపెట్టారు. అమెరిక‌న్ టీవీ సిరీస్ ‘లాస్ వేగాస్‌’తో యాక్టింగ్ కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తరవాత మ‌రికొన్ని ఇంగ్లీష్ టీవీ షోల‌లో న‌టించాక‌ ఇండియాకు తిరిగొచ్చిన ఆమె.. టాలీవుడ్‌లో న‌టిగా, టీవీ హోస్ట్‌గా తనదైన ముద్ర వేశారు.

ఓవైపు సినిమాల‌లో న‌టిస్తూనే, తెలుగు టీవీ షోల‌కు ప్రెజెంట‌ర్‌గా వ్యవ‌హ‌రిస్తూ వ‌చ్చారు ల‌క్ష్మి. ఆమె హోస్ట్‌గా వ్యవ‌హ‌రించిన ‘ఫీట్ అప్ విత్ స్టార్స్’ చాట్ షోకు వీక్షకుల నుంచి మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. లాక్‌డౌన్ పీరియ‌డ్‌లో ‘లాక్డ్ అప్ విత్ ల‌క్ష్మీ మంచు’ పేరుతో ప‌లువురు ఫేమ‌స్ సినీ, పొలిటిక‌ల్ సెల‌బ్రిటీల‌తో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ ద్వారా ఆమె ఇంట‌రాక్ట్ అయ్యారు. ఇదిలా ఉంటే, నేడు (అక్టోబ‌ర్ 8న) తన పుట్టినరోజు సందర్భంగా లక్ష్మి తన కొత్త షోను ప్రకటించారు.

సౌత్ బే స‌మ‌ర్పిస్తోన్న ఆ షో పేరు ‘క‌మింగ్ బ్యాక్ టు లైఫ్ విత్ ల‌క్ష్మీ మంచు’. ‘లాక్డ్ అప్ విత్ ల‌క్ష్మీ మంచు’ త‌ర‌హాలోనే ఈ షోలో ఆమె ఫిలిమ్స్‌, స్పోర్ట్స్‌, ఫ్యాష‌న్‌, ఫుడ్‌ త‌దిత‌ర రంగాల‌కు చెందిన సెల‌బ్రిటీల‌ను ఇంట‌ర్వ్యూ చేయ‌నున్నారు. ఈరోజు విడుదల చేసిన ప్రోమోలో రాజ‌మౌళి, తాప్సీ ప‌న్ను, సెంథిల్ రామ‌మూర్తి, సానియా మీర్జా, ప్రకాష్ అమృత‌ రాజ్‌, శంత‌ను, నిఖిల్‌, బిభు మొహాపాత్ర, పూజా ధింగ్రా, అన్నా పొలీవియౌ త‌దిత‌ర ఫేమ‌స్ ప‌ర్సన్స్ క‌నిపిస్తున్నారు. ఈ షో త్వర‌లోనే ప్రారంభం కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Open chat