చందమామ కాజల్ అగర్వాల్ అందం, అభినయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెరీర్ మొదలై 13 ఏళ్లైనా కూడా ఇప్పటికీ వరుస సినిమాలతో సత్తా చాటుతోంది.

Spread the love

చందమామ కాజల్ అగర్వాల్ అందం, అభినయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  కెరీర్ మొదలై 13 ఏళ్లైనా కూడా ఇప్పటికీ వరుస సినిమాలతో సత్తా చాటుతోంది.

 

చందమామ కాజల్ అగర్వాల్ అందం, అభినయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  కెరీర్ మొదలై 13 ఏళ్లైనా కూడా ఇప్పటికీ వరుస సినిమాలతో సత్తా చాటుతోంది.  ఓ వైపు యంగ్ హీరోలతో నటిస్తూనే, సీనియర్ హీరోల సరసన కూడా ఆడిపాడుతోంది. ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం ‘ముంబై సాగా’ అనే హిందీ సినిమాలో నటిస్తుంది. మరోవైపు లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా వస్తోన్న ‘ఇండియన్ 2’ చిత్రంలో కీలక పాత్రలో కనిపించబోతుంది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తోన్న ‘ఆచార్య’లో ఛాన్స్ దక్కించుకుంది. ఇలా మొత్తం మూడు పెద్ద ప్రాజెక్ట్స్  ఆమె చేతిలో ఉన్నాయి. ఇక దళపతి విజయ్, మురుగదాస్ కాంబినేషన్‌లో ‘తుపాకి 2’ త్వరలో ప్రారంభం కానుంది. ఇందులో హీరోయిన్‌గా కాజల్ నటించే అవకాశం ఉందని సమాచారం.

తాజాగా ఈ అందాల చందమామకు మరో ఆఫర్ వచ్చిందట. ఓ ఇంటర్నేషనల్ వెబ్ సిరీస్‌లో కాజల్ నటించనుందని సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో ఓటీటీలు రాజ్యమేలుతున్నాయి. అంతేకాదు..తక్కువ ఖర్చుతో విభిన్నమైన కంటెంట్ ను ఓటీటీ సంస్థలు ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాయి. ఇప్పటికే బాలీవుడ్ తో పాటు పలువురు సౌత్ ఇండియా బడా స్టార్స్ వెబ్ సిరీసుల్లో నటిస్తున్నారు.   హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా వెబ్‌సిరీస్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్  ఇచ్చినట్టు సమాచారం. అది కూడా బోల్డ్ క్యారెక్టర్‌లో నటించనుందట. బాలీవుడ్ స్పైసీ బ్యూటీ ప్రియాంక చోప్రా హాలీవుడ్‌లో ఏబీసీ ఛానల్‌తో కలిసి ‘క్వాంటికో’ అనే టీవీ సీరీస్ లో నటించిన విషయం తెలిసిందే. మూడు సీజన్స్ వరకు ప్రసారం అయినా.. ఆ టీవీ షోలో ఆమె ప్రియాంక అందం, అభినయంతో మెస్మరైజ్ చేసింది. అయితే ఆ టీవీ షోను కాజల్‌తో ఇండియన్ వెర్షన్‌ను నిర్మించడానికి నెట్ ఫ్లిక్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సీరీస్ కి ప్రియాంక పాత్రకి కాజల్ ని ఎంచుకున్నారట. దీంతో వెబ్ సిరీస్‌లో కాజల్ మరింత గ్లామర్‌గా అలరించనుందన్నమాట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Open chat