ఎవరీ గౌతమ్ కిచ్లు.. కాజల్ కాబోయే భర్త బ్యాక్‌గ్రౌండ్ ఏంటి?

Spread the love

కాజల్ అగర్వాల్ పెళ్లిపీటలు ఎక్కుతోన్న సంగతి తెలిసిందే. వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును ఆమె వివాహం చేసుకోబోతున్నారు. ఈనెల 30న వీరి వివాహం జరగనుంది.

అందాల చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును ఆమె వివాహం చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని కాజల్ స్వయంగా మంగళవారం ప్రకటించారు. అక్టోబర్ 30న ముంబైలో తమ కుటుంబ సభ్యుల సమక్షంలో నిరాడంబరంగా వివాహ వేడుక జరగనుందని కాజల్ స్పష్టం చేశారు. తాము ప్రారంభించబోయే ఈ కొత్త ప్రయాణానికి అందరి ఆశీస్సులు కావాలని ఆమె కోరుకున్నారు. అంతేకాదు, పెళ్లి చేసుకున్న తరవాత కూడా ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తానని స్పష్టం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు.

ఇక, కాజల్ కాబోయే భర్త గౌతమ్ కిచ్లు విషయానికి వస్తే.. ఆయన ఒక ఇంటీరియర్ డిజైనర్, టెక్ ఎక్స్‌పర్ట్. గౌతమ్ ప్రస్తుతం ముంబై కేంద్రంగా ‘డిసెర్న్ లివింగ్’ (Discern Living) అనే ఈ-కామర్స్ కంపెనీని నడుపుతున్నారు. ఈ కంపెనీ ద్వారా వినియోగదారులకు ఇంటీరియర్ డిజైన్, హోమ్ డెకరేషన్ సర్వీసులను అందిస్తున్నారు. హౌస్ డిజైనింగ్, రూమ్ డిజైనింగ్‌తో పాటు డిజైనర్ ఫర్నీచర్, డెకార్ ఐటమ్స్, పెయింటింగ్స్, ఇతర హౌస్‌హోల్డ్ ఐటమ్స్‌ను గౌతమ్ కంపెనీ విక్రయిస్తోంది.

గౌతమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటారు. అయితే, ఇందులో తన వ్యక్తిగత పోస్టుల కన్నా హోం డిజైనింగ్ పోస్టులో ఎక్కువగా ఉన్నాయి. ఇంటిని, గదులను ఎలా అలంకరించుకోవాలో చెబుతూ మంచి మంచి డిజైన్లను ఆయన పోస్ట్ చేస్తుంటారు. అంతేకాదు, ముంబై మారథాన్‌లలోనూ గౌతమ్ పాల్గొంటుంటారు. ఆయన మంచి రన్నర్. ఇక గౌతమ్ ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్ చూస్తే.. ఆయన ముంబైలోని కేథడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్‌లో చదివారు. మసాచుసెట్స్‌ (యూఎస్)లోని టుఫ్ట్స్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించారు.

ఇదిలా ఉంటే, కాజల్ తన పెళ్లి వార్తను ప్రకటించగానే గౌతమ్ కిచ్లుతో ఆమె క్లోజ్‌గా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోల్లో గౌతమ్, కాజల్ చాలా క్లోజ్‌గా కనిపిస్తున్నారు. నిజానికి వీరిద్దరూ చిన్ననాటి స్నేహితులు. ఆ స్నేహం ప్రేమగా మారి ఇప్పుడు వివాహ బంధంతో ఒక్కటవుతున్నారు. వీరి పెళ్లిని రెండు రోజుల వేడుకగా కుటుంబ సభ్యులు నిర్వహించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Open chat